ఆమెకు అండగా ‘సఖీ’
కుటుంబంతోపాటు పని చేసే ప్రదేశం సహా పలు చోట్ల మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు.
- మహిళలకు భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- సమస్యల పరిష్కారానికి వేదికగా ‘సఖీ’కేంద్రాలు
- ఉచితంగా కౌన్సెలింగ్, న్యాయ, వైద్య సేవలు
- బాధితులకు అండగా 24 గంటలు అందుబాటు
మెదక్ రూరల్, డిసెంబర్ 1: కుటుంబంతోపాటు పని చేసే ప్రదేశం సహా పలు చోట్ల మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు. పనిచేసే పలు చోట వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేని ఎందరో మహిళలు, యువతులకు మనోధైర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సఖీ’కేంద్రాలను ఏర్పాటు చేసి చేయూతనిస్తున్నది. దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్‌లో సెప్టెంబర్ 2019లో ‘సఖీ’కేంద్రం ఏర్పాటు చేసింది. వ్యక్తిగత సమస్యలతో వచ్చేవారికి న్యాయపరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఎన్నో రకాల సేవలను అందిస్తూ.. జీవితాలకు భరోసానిస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు. న్యాయ, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి.
రూ. 73.15 లక్షల వ్యయంతో ‘సఖీ’భవనం
మెదక్ జిల్లా కేంద్రంలో ఇటీవల రూ.73.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘సఖీ’భవన కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
టోల్ ఫ్రీ నంబర్ 181
‘సఖీ’కేంద్రాలకు రాలేని మహిళల కోసం హెల్ప్‌లైన్ నంబర్ సైతం ఏర్పాటు చేశారు. సమస్యల్లో ఉన్న మహిళలు టోల్ ఫ్రీ నంబర్ 181ను లేదా మెదక్ సఖీ కేంద్రం నంబర్లు 08452-295181, 9346146580, సంప్రదించవచ్చు. ఇది 24గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ సమయంలోనైనా బాధితులు ఫోన్ ద్వారా సంప్రదిస్తే.. వారున్న ప్రదేశానికే ఓ వాహనం వస్తుంది. ఈ వాహనంలో ఒక మహిళా కానిస్టేబుల్‌తో పాటు మానసిక నిపుణులు సైతం ఉంటారు. వీరు బాధితులకు భరోసానిస్తూ ‘సఖీ’కేంద్రానికి తీసుకెళ్తారు.
లభించే సేవలు
హింస, వేధింపులు బారిన పడ్డ వారికి నేషనల్ హెల్త్ మిషన్, 108, పోలీసులతో అత్యవసర సేవలు అందించడం, వారిని కాపాడిన తర్వాత ఆశ్రయం కల్పించడం కోసం సమీపంలోని హోమ్‌లకు తరిలించడం బాధితులకు వైద్య సేవలు అందించేందుకు సమీప దవాఖానలకు పంపించడం వంటి సేవలు ‘సఖీ’కేంద్రం అందిస్తున్నది. వారికి అవసరమయ్యే పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహిస్తారు. తాత్కాలింగా మహిళా హోంలలో ఆశ్ర యం కల్పించి, కనీసం ఐదు రోజులకు తక్కువ కాకుండా వసతి కల్పిస్తారు. బాధితులు కోర్టు ప్రొసిడింగ్స్‌కు హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తమ వాదనలు వినిపించే సౌకర్యాన్ని ‘సఖీ’కేంద్రం కల్పిస్తుంది.
పరిష్కారమైన వివిధ కేసులు
* 2019 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ 17 వరకు 940 కేసులు నమోదు కాగా అందులో 810 కేసులు పరిష్కరించగా, 130 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
* 309 అవగాహన సదస్సులు నిర్వహించి 87,669 మందికి ‘సఖీ’సేవల గురించి తెలియజేశారు.
ఎలా సంప్రదించాలి..
మహిళలు, యువతులు తమకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన ‘సఖీ’కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. ఇక్కడ సరైన కౌన్సిలింగ్‌తో పాటు న్యాయపరమైన, పోలీసు సహకారంతో కోర్టు ద్వారా పరిష్కారం పొందే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ అడ్మిన్‌తో పాటు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. బాధితులు 181కుగాను 100కి గాను సమాచారం అందిస్తే అవసరమైన సేవలు అందించేందుకు ‘సఖీ’కేంద్రం సమాయత్తం అవుతుంది. అవసరాన్నిబట్టి బాధితులకు వాహనం అందుబాటులో ఉంటుంది.
మహిళా భద్రత ప్రభుత్వం పెద్దపీట..
మహిళా భద్రత కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని అందు లో భాగంగా మహిళలు, యువతులకు అండగా ప్రభు త్వం ‘సఖీ’ కేంద్రాలు ద్వారా సేవలు అందించడం జరుగుతున్నదన్నా రు. ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో రూ 73.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘సఖీ’భవన కేంద్రం ప్రారంభించడం జరిగింది. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైన తక్షణమే సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 181కు కాల్ చేయాలి. బాధితులు ఆధైర్యపడకుండా ‘సఖీ’కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
– పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
కుటుంబ కలహాల కేసులే అధికం
బాధిత మహిళలు ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే స్పందిస్తు న్నాం. వారికి తగిన రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటు న్నాం. సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు అవసరమైన మేరకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కేంద్రానికి వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది కుటుంబ కలహాల సమస్యలతో వస్తున్నారు. విద్యాసంస్థల యజమాన్యాలు, అంగన్వాడీ టీచర్లు, సమైక్య మహళా సభ్యుల సహకారంతో సేవలను మరిం త విస్తృతం చేస్తున్నాం.
– రేణుక, సఖీ కేంద్ర నిర్వాహకురాలు
24 గంటలు అందుబాటులో సేవలు
వేధింపులకు గురైన బాధిత మహిళలకు అండగా నిలచి వారికి భరోసా కల్పించడానికే సఖీ కేంద్రం పని చేస్తుంది. ఆపదలో ఉన్న మహిళలు, యువతులు నిర్భయంగా టోల్ ఫ్రీ నం బర్181కు కాల్ చేస్తే, వారికి అవసరమైన సేవలు అందిస్తాం. సఖీ సెంటర్లలో సేవలు అం దించేవారు 24 గంటలు అందుబాటులో ఉంటా రు. బాధితుల పక్షాన ఎవరైనా ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తాం. సదరు వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– బ్రహ్మజీ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి, మెదక్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

