సంగారెడ్డి ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): సంగారెడ్డి జిల్లా లో మాదకద్రావ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు డీజీపీ జితేందర్ ఆదేశించారు. మం గళవారం ఎస్పీ కార్యాలయాన్ని ఐజీ సత్యనారాయణతో కలిసి ఆయన తనిఖీ చేసి మొక్కలు నాటారు. అనంతరం పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాలు కనిపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. మట్కా, జూదం ఆనవాళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మల్టిజోన్ 2 ఐటీ సత్యనారాయణ, ఎస్పీ రూపేశ్, అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
పోలీసుల పనితీరును డీజీపీ ప్రశంసించారు. ఉత్తమ సేవలు అందజేసిన పోలీసులు రామ్మోహన్(డీఎస్పీ),సీఐలు శివలింగం, మల్లేశం, రమేశ్, విజయకృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, ఆసిఫ్‌లకు డీజీపీ రివార్డులు ప్రదానం చేశారు. ఆర్ఐలు జానకిరామ్, హన్మిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, జానకిరామ్, ఎస్పీ కార్యాలయం ఏవో కల్యాణి, సూపరింటెండెంట్ వెంకటేశానికి రివార్డులు అందజేశారు.