పటాన్చెరు బీజేపీకి ఝలక్
పటాన్చెరు బీజేపీకి ఝలక్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, హోం మంత్రి మహమూద్ అలీ గులాబీ కండువా కప్పి శంకర్‌యాదవ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.
- బీఆర్ఎస్లోకి మాజీ కార్పొరేటర్
- మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ సమక్షంలో చేరిక
- బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
- సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
- శంకర్‌యాదవ్ రాకతో పటాన్చెరులో అజేయశక్తిగా బీఆర్ఎస్
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధే అఖండ విజయం అందిస్తుంది
- ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు
పటాన్చెరు, అక్టోబర్ 26: పటాన్చెరు బీజేపీకి ఝలక్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, హోం మంత్రి మహమూద్ అలీ గులాబీ కండువా కప్పి శంకర్‌యాదవ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకర్‌యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. బీఆర్ఎస్ ఇప్పుడు అజేయశక్తి అని మం త్రి పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని మంత్రి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు, కుట్రలు చేసినా అసెంబ్ల్లీ ఎన్నికల్లో విజయం మాదేనన్నారు. సంక్షేమం విషయంలో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ పాలసీలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెత్తాలంటే బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను మంత్రి కోరారు. శంకర్‌యాదవ్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బీఆర్ఎస్లో చేరడం పార్టీకి మేలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరులో పార్టీ అజేయశక్తిగా మారిందన్నారు. బీఆర్ఎస్లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెం దుతున్నదన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితు లై నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నా రు. మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్‌కు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు. ప్రజల్లో మం చి పేరున్న శంకరన్న బీఆర్ఎస్లో చేరడం పార్టీకి ఎంతో మేలు చేస్తుందన్నారు. పటాన్చెరులో అఖండ మెజార్టీతో గెలుస్తున్నామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. త్వరలో భారీ చేరికలుంటాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, నగేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

