MLA Rohitrao | మెదక్ రూరల్, ఆగస్టు 24 : ఘనపూర్ మండలం రాజు పేట్ తండాలో ఎమ్మెల్యే, డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రాజుపేట తాండలో తీజ్ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొలకెత్తిన గోధుమ గింజల బుట్టలను చిన్నారులు తలపైన పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఈ ఊరేగింపులో చిన్నారులతో కలిసి డాన్స్ చేశారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావ్ మాట్లాడుతూ.. గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు.
గిరిజన మహిళలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండగ తీజ్ అని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హవెలి ఘనపూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?