పాపన్నపేట, ఆగస్టు 2 : ఉపాధ్యాయ, పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 న మెదక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని యుఎస్పిసి నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు కుర్తివాడలో ధర్నా పోస్టర్ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్, టి పి టీ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి.. పదోన్నతులు ద్వారా నింపాలన్నారు. సర్వీస్ రూల్ రూపొందించి రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలని, నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న డీఏలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీఓ 317 కారణంగా స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, వారిని సొంత జిల్లాలకు పంపాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయలకు విరమణ రోజునే రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు బత్తుల భూషణం, జిల్లా కార్యదర్శి నాచారం శేఖర్, జిల్లా నాయకులు కె.వి.ఆర్ నాయుడు, మల్లేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.