పాపన్నపేట, మార్చి 12: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని అబ్లాపూర్కు చెందిన సుస్మిత గ్రూ పు-2 ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 406 మార్కులు సాధించి అమ్మాయిల విభాగంలో రెండో స్థానా న్ని సంపాదించింది.
ఆమె ప్రస్తుతం కొల్చారం గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారు. గ్రూప్-1లో కూడా 401 మార్కులు సంపాదించిన సుస్మితను కుటుంబసభ్యులు, మండల వాసులు అభినందిస్తున్నారు.