నర్సాపూర్, జూలై 10: పార్టీలకతీతంగా నర్సాపూర్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లోని 10 వార్డులో రూ.30 లక్షలతో అండర్ గ్రౌండ్ డైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలు చేయాలన్నారు. సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
అనంతరం పట్టణంలో సర్ ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ సత్యంగౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్లు కండుల రాజు, మోహిజోద్దిన్, నాయకులు బాల్‌రెడ్డి, నాగరాజుగౌడ్, హుస్సేన్, మహ్మద్, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.