నర్సాపూర్, ఫిబ్రవరి 23: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్,కౌన్సిలర్ల మొదటి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గాన్ని సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేశ్‌యాదవ్ కోరిక మేరకు నర్సాపూర్ మున్సిపాలిటీకి వైకుంఠ రథాన్ని అందజేస్తానన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజు, వైస్ చైర్మన్ బుచ్చేశ్‌యాదవ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్చరణ్రెడ్డి, మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు.
శివ్వంపేట, ఫిబ్రవరి 23: మెదక్ జిల్లా గోమారం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే స్వగ్రామమైన గోమారంలో రూ. 30లక్షలతో సీసీరో డ్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం త్వరలోనే పనులు ప్రారంభి స్తామన్నారు.
ఎస్సీ కాలనీలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 15లక్షలు మంజూరయ్యాయని అండర్‌గ్రౌండ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా గ్రంథా లయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రా గౌడ్, నవాబ్‌పేట సర్పంచ్ అశోక్‌రెడ్డి, సీనియర్ నాయ కులు వాకిటి హనుమంత్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి, నర్సిం హారెడ్డి, కుంట లక్ష్మణ్, శ్రీశైలంయాదవ్, రామ కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సాకేత్గౌడ్, పల్లె పద్మ, కాముని నవీన్, కుంట నగేశ్ పాల్గొన్నారు.