నర్సాపూర్, మార్చి 24: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలంలోని రొయ్యపల్లి, నాగారం, షేర్ఖాన్పల్లి, అక్వంచగూడా గ్రామాలను జిన్నారం మండలంలో కలపాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ ప్రతిపాదనను ఇంతకు ముందే పంపించామని గుర్తుచేశారు.
ఈ గ్రామాలు జిన్నారం మండలానికి 4 కిలోమీటర్ల దూ రంలోనే ఉంటాయని వెల్లడించారు. మం డల హెడ్ క్వార్టర్‌కు రావాలంటే 20 కిలోమీటర్లు ప్రజలు ప్రయాణం చేయాల్సి వస్తున్నదని, దీంతో ప్రజలు వ్యయప్రయాసాలకు గురవుతున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా హత్నారా నుంచి రావడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. ఈ గ్రామాలను హత్నూరా మండలం నుంచి తొలిగించి జిన్నారం మండలంలో కలపాలని స్పీకర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.