నర్సాపూర్, ఏప్రిల్ 11: రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేయాలని అధికారులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్న ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలన్నారు.
లారీలను అందుబాటులో ఉంచాలని, రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు త్వరగా జమ చేయాలన్నారు. గత సీజన్లో పంట బోనస్ డబ్బులు చాలామంది రైతులకు అందలేదని, ఇప్పుడు అలాంటి తప్పి దం లేకుండా ప్రభుత్వం చూడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో వైద్య శ్రీనివాస్, ఏపీఎం గౌరీశంకర్, సీసీ ప్రవీణ, ఏఈవో నిరోష, పంచాయతీ కార్యదర్శి రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, మాజీ సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, నాయకులు మహేశ్‌గౌడ్, రాజుగౌడ్, శేఖయ్య, కనకయ్య, శేఖర్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.