ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆలస్యం చేయొద్దు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు త్వరితగతిన చెలించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 83 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఆమె అందజేశారు.
- లబ్ధిదారులకు రూ. 60వేలు ఉపాధిహామీ నిధులతో ముడిపెట్టొద్దు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
శివ్వంపేట, మే 11 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు త్వరితగతిన చెలించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 83 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఆమె అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3500వేల ఇండ్లు మంజూరు చేస్తే , ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కోటా కింద 2100 ఇండ్లు, ఎమ్మెల్యే కోటా కింద 1400 ఇండ్లు ఉండగా, ఎమ్మెల్యే కోటా కింద కేవలం 400 మాత్రమే మంజూ రు అయ్యాయని, ఇంకా వెయ్యి ఇండ్లు మంజూరు కాలేవన్నారు. మొదటి విడత లబ్ధ్దిదారులకు బిల్లులు చేయడంలో జాప్యం జరుగుతున్నదని, సకాలంలో వేస్తే లబ్ధిదారులు త్వరగా ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారులకు ఉపాధిహామీ నిధులు ముడిపెడుతూ రూ. 60వేలు వేయడం జరుగుతోందని, దీంతో లబ్ధ్దిదారులు ఉపాధిహామీలో పనిచేసుకోవడానికి 100రోజులు అవకాశం ఉంటే , కేవలం 10రోజులు మాత్రమే పని చేసుకోవాల్సి వస్తుందన్నారు.
ప్రభుత్వం స్పందించి లబ్ధ్దిదారులకు రూ. 60వేల ఇచ్చి, యథావిధిగా 100రోజుల ఉపాదిహామీ పని కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటరాంరెడ్డి, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచ్ వెంకటేశ్వర్, సీనియర్ నాయకులు మహిపాల్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి, రాజశేఖర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సయ్య, ఆకుల శ్రీనివాస్, పవన్‌గుప్తా, లాయక్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

