జహీరాబాద్, మార్చి 27: భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాల్పులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
అత్యవసరం అనుకుంటే ఉదయమే జనం ప్రయాణమవుతున్నారు. ఇండ్లల్లో ఉండేవారు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మరి కొంత మంది చెట్లకింద సేదతీరుతున్నారు. గత సంవత్సరం కంటే ఎండల తీవ్రత ఎక్కవగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.