అమరావతి : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ని అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ ( Congress ) పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ ( BJP ) చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు
. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ఊరేగింపుగా చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో చేతుల్లో ఉన్న పార్టీ జెండా కర్రలు, వాటర్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెస్సే అసలైన సూత్రదారి విమర్శించారు. ఢిల్లీ నిరసనలో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులున్నాయని ఆరోపించారు. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్టు చేసిందని పేర్కొన్నారు.