వాహనదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి : భద్రాచలం ఎంవీఐ వెంకటపుల్లయ్య
వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భద్రాచలం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు..
బూర్గంపహాడ్, జూలై 22 : వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భద్రాచలం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, వాహన ఫిట్నెస్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. వాహనాలకు అధిక పవర్ వచ్చే ఎల్ ఈడీ లైట్లు పెడితే ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని వాడవద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఈడీ లైట్లు, ఫాగ్ లైట్లు, అధిక పవర్ బల్బులు పెట్టిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు తమ వద్ద తప్పనిసరిగా అన్ని వాహనపత్రాలు ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనపత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

