రామాయంపేట, మే 02 : రామాయంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. శుక్రవారం మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం యోగా గురువు భరత్‌కుమార్ విద్యార్థులకు యోగా నేర్పించారు.
అనంతరం ఎంఈవో శ్రీనివాస్ మాట్లాడుతు సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు యోగాతో బాటు డ్రాయింగ్, కరాటే తదితర వాటికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపు 15రోజుల పాటు కొనసాగుతుం దన్నారు. ఈ శిబిరం ప్రతిరోజు ఉదయం 8గంటల నుండి 11గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 15రోజుల పాటు జరిగే శిక్షణకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విధిగా పాల్గొనాలన్నారు. విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.