చిలిపిచెడ్,జూలై 6 : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఈ ఇద్దరు నాయకులు మండలాల్లో వేర్వేరుగా పర్యటిస్తున్నారు. వీరు పర్యటిస్తున్నప్పుడు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎవరి వెంట తిరగాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
ఆదివారం చిలిపిచెడ్ మండలంలో ఒకేరోజు ఈ ఇద్దరు నాయకులు పర్యటించారు. గౌతాపూర్ టోప్యా తండాలో,ఫైజాబాద్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ప్రొటోకాల్ పాటించకుండా గంగారం,అజ్జమర్రి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు కొబ్బరికాయలు కొట్టాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. కార్యక్రమాలకు సంబంధించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వర్గం , ఆవుల రాజిరెడ్డి వర్గం శ్రేణులు ఎవరికి వారు సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్ చేశారు.