మెదక్, జూలై 25 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా వ్యాప్తంగా కుకల బెడద తీవ్రమైంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులను వెంటాడి కరుస్తుండడంతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. పట్టణ శివార్లలో రోడ్ల పకన కోళ్ల వ్యర్థాలను పడేస్తున్నారు. వీటిని తినేందుకు అలవాటు పడిన ఊరకుకలు, పిచ్చికుకలు జనాలపై విజృంభిస్తున్నాయి.
రోడ్ల వెంట వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులపైన విరుచుకుపడుతూ దాడులు చేస్తున్నాయి. ఈ సంఘటనల్లో పలువురు గాయపడి దవాఖానల పాలవుతున్నారు. మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాలు, గ్రామాల్లో కుక్కల సంతతి పెరిగింది. గతంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో కుకలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం లాంటివి చేసేవారు. ప్రస్తు తం ఆతరహా చర్యలు కనిపించడం లేదు. కుకలను చంపకుండా వాటి సంతతిని పెరగకుండా చర్యలు తీసుకోవాల్సి అధికారులు పట్టించుకోవడం లేదు.
మెదక్ పట్టణంలో వీధి కుకల సంతతి రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో కుకల బెడద ఎకువగా ఉంటే మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం మేరకు కుకలను పట్టణంలో లేకుండా చేసి వాటిని మరో ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో కుకల బెడద ఎకువ కావడంతో ప్రజలు రోడ్ల వెంట ప్రయాణించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. పట్టణంలోని జంబికుంట, హౌసింగ్ బోర్డు, ఫత్తేనగర్, నవాబ్‌పేట, గోల్కొండ వీధి, అజంపుర, ఇందిరాకాలనీ లాంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో ఎకువగా చిన్నారులే ఉన్నారు. కుకలను చంపవద్దని అధికారులు చెబుతున్నా వాటి సంతానం వృద్ధి చెందకుండా ఆరోగ్యశాఖ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కుకల భయానికి ఇంటి నుంచి చిన్నారులను బయటకు పంపలేక, కర్ర సహాయంతో తప్ప బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు.
మెదక్ జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో కుకకాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఆరు బయట ఆడుకోవడానికి వచ్చిన చిన్నారులు, తినుబండరాల కోసం దుకాణాలకు వెళ్తున్న వారిని వెంటాడి గాయపరుస్తున్నాయి. ఇప్పటికైనా పశుసంవర్ధకశాఖ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో కుకల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో జరిగిన
వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి. వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, టీకా ఇవ్వడంతో పాటు, చికిత్సకు ఎంత వ్యయం అవుతుందనే వివరాలు మొదట సేకరించాలని ప్రభుత్వం ఆదేశించినా ఎక్కడా అమలుకావడం లేదు. మెదక్ జిల్లాలో 17,636 కుక్కలు ఉండగా, 2,213 మంది కుక్క కాటుకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 62,275 కుక్కలు కాగా, 1,475 మంది, సిద్దిపేట జిల్లాలో 47,568 కుక్కలు ఉండగా, 1,119 మంది కుక్క కాటున పడ్డారు. కుక్కలకు స్టెర్లైజేషన్కు చర్యలు తీసుకుంటున్నా వాటి బెడద తప్పడం లేదు.