సీఎం కేసీఆర్ సారథ్యంలో.. అన్ని రంగాల్లో నెంబర్1
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- స్వల్ప కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా దూసుకుపోతున్న తెలంగాణ
- అన్నిరంగాల్లో సంగారెడ్డి జిల్లా అభివృద్ధి
- సాగు నీరు, సంక్షేమ పథకాలకు పెద్దపీట
- సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం
- రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
సంగారెడ్డి, జూన్ 2(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్‌కు వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ బీబీ పాటిల్‌కు కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ స్వాగతం పలికారు. అమరవీరుల స్థూపం వద్ద వారు నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్వల్ప కాలంలో తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతి శీల రాష్ట్రంగా ఎదిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. జిల్లాలో ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
రైతుల కళ్లలో ధీరత్వం..
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంగారెడ్డి జిల్లా రైతుల కళ్లలో ధీనత్వం కనిపించేందని, సీఎం కేసీఆర్ పాలనలో ధీరత్వం తొణికిస లాడుతున్నదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జిల్లాలో 7.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. రైతుబంధుతో పది విడతల్లో 3.24 లక్షల మంది రైతులకు రూ.3272 కోట్లు అందజేసినట్లు తెలిపారు. రైతుబీమాతో 6వేల రైతు కుటుంబాలకు రూ.309 కోట్లు అందజేశారన్నారు. రూ.26 కోట్లతో 116 రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. రూ.4427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకా లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో రూ.240 కోట్ల తో చెరువులు అభివృద్ధి చేశామన్నారు. రూ.1094 కోట్లతో మిష న్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందజేస్తున్నట్లు చెప్పారు.
సంక్షేమానికి పెద్దపీట
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1.62 లక్షల మందికి ఇప్పటి వరకు రూ.2458 కోట్ల ఆసరా పింఛన్లు అందజేస్తున్నారన్నారు. దళితబంధుతో జిల్లాలో 444 మంది లబ్ధిదారులకు రూ.44.40 కోట్ల ఆర్థిక సాయం అందజేశారన్నారు. జిల్లాలో 81 తండాలను పంచాయతీలుగా మార్చినట్లు తెలిపారు. రూ.187 కోట్లతో 19,203 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారన్నారు. మత్స్య సంపద విలువ రూ.113 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 39 వేల మంది ఆడపిల్లలకు రూ.382 కోట్ల ఆర్థిక సాయం అందజేశారన్నారు. షాదీముబారక్‌తో 10715 మందికి రూ.99 కోట్లు అందజేసినట్లు చెప్పారు. హరితహారంలో 8.80 కోట్ల మొక్కలు నాటారన్నారు. మనబడి కార్యక్రమంలో జిల్లాలోని 441 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.36 కోట్లు ఖర్చు చేశారన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వంద పడకల దవాఖానలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరులో రూ.70 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండో విడత కంటివెలుగులో 10,93,649 మందికి పరీక్షలు చేసి 1.33 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 19 బస్తీ, 173 పల్లె దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 79,848 మందికి కేసీఆర్ కిట్ అందజేశామన్నారు.
అభివృద్ధి పనులకు భారీగా నిధులు
సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. జిల్లాలో 820 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణానికి రూ.164 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.138 కోట్లతో గ్రామాల్లో 2865 కిలోమీటర్ల సీసీ రోడ్లు, మున్సిపాలిటీల్లో రూ.78.66 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.2727 కోట్లతో 1875 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారులు నిర్మించినట్లు తెలిపారు. రహదారుల మరమ్మతుకు రూ.734 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లాలో టీఎస్ఐపాస్ ద్వారా రూ.28వేల కోట్ల పెట్టుబడులతో 2573 పరిశ్రమలు ఏర్పాటు చేసి 1.88 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. 2014 నుంచి 2022 వరకు 1,61,572 ఉద్యోగాల భర్తీకి అనుమతించిగా ఇప్పటి వరకు 1,41,735 పోస్టుల ఎంపిక పూర్తయినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో మెంచు నగేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు మాణిక్యం, విజయేందర్‌రెడ్డి, డా.శ్రీహరి, ప్రభుగౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన భార్గవ్ తండ్రి నోముల సత్యనారాయణను మంత్రి సన్మానించారు. పటాన్చెరు మండలంలోని చిట్కుల్, కర్దనూర్, రామేశ్వరం బండ, కంది మండలం ఎద్దుమైలారం పంచాయతీలకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పొందిన ఐఎస్వో 9001-2015 సర్టిఫికేట్లు అందజేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన జెండా
సంగారెడ్డి, జూన్2: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, జడ్పీ భవనాలు విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రమణకుమార్, జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, డీసీఎంఎస్ కార్యాలయంలో చైర్మన్ మల్కాపురం శివకుమార్, బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, టీజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

