వైభవంగా గురు పౌర్ణమి.. సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ల్లాలో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలుచేపట్టారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది.
- సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- అభిషేకాలు, భజనలు, సాయికీర్తనలు
- పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
- హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
- ఘనంగా పల్లకీ సేవ
మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ రామాయంపేట/ వెల్దుర్తి/ తూప్రాన్/ నర్సాపూర్/ చిన్నశంకరంపేట, జూలై3: జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలుచేపట్టారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ మండల పరిధిలోని కొయ్యగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో, రామాయంపేట మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గరుడసేవ, పల్లకీసేవతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
మాసాయిపేట, వెల్దుర్తిలోని భూలక్ష్మిమాత ఆలయం, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం నిర్వహించారు. తూప్రాన్ పట్టణంలోని అంబేద్కర్నగర్ సాయిబాబా దేవాలయంలో ఆలయ ధర్మకర్త, హైకోర్టు అడ్వకేట్ ఎండ్రెల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. నర్సాపూర్, చిన్నశంకరంపేట సాయిబాబా ఆలయంలో భక్తులు పల్లకీ సేవ కార్యక్రమాలు చేపట్టారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

