మెదక్ అర్బన్, డిసెంబర్ 24: క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ చర్చి వద్ద భారీ పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. భద్రత చర్యలను ఎస్పీ విలేకరులకు వివరించారు. జాతరలో భక్తులకు ఆటంకం కలుగకుండా, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ గురించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మొత్తం 4 సెక్టార్లను ఏర్పాటు చేసి, అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 13 మంది సీఐ, ఆర్ఐలు, 49 ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ 117, కానిస్టేబుల్లు 185, మహిళా సిబ్బంది 54, హోంగార్డులు 74 అక్సెస్ కంట్రోల్ టీంలు 8, నాలుగు డే బైనాక్యులర్ టీంలు, 2 రోప పార్టీలు, స్పెషల్ పార్టీలు, క్రైమ్ టీమ్, షీ టీమ్స్, ఏఆర్ సిబ్బంది మొత్తం దాదాపు 500 మందితో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. భక్తులు వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ స్థలాల్లోనే నిలుపుకోవాలని సూచించారు. జాతరలో చిన్న పిల్లలు తప్పిపోయినైట్లెతే చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్లో వారి వివరాలు తెలుపాలని సూచిం చారు. భద్రతలో భాగంగా బీ.డీ.టీం డాగ్ స్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, భద్రత విషయంలో ఎలాంటి రాజీపడలేదని తెలిపారు.