నర్సాపూర్, నవంబర్ 4: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు తలెత్తే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో హెల్ప్‌లైన్ ఏర్పా టు చేస్తామని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన పేర్కొన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో జిల్లా అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ధాన్యం తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని, ధాన్యం పూర్తిగా ఎండిన తర్వాతనే తూకానికి తీసుకువస్తే రైతులకు లాభం చేకూరుతుందని సూ చించారు.
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ధాన్యం తీసుకువచ్చిన రైతులకు టోకెన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 25 టార్పాలిన్లు అదనంగా పెంచామని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సన్నరకం ధాన్యానికి తప్పకుండా రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. సమావేశంలో మెదక్ జాయింట్ కలెక్టర్ నాగేశ్, సం గారెడ్డి జాయింట్ కలెక్టర్ మాధురి, డీఆర్డీ వో జ్యోతి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్, సివిల్ సైప్లె, అగ్రికల్చర్ ఎంఏవోలు పాల్గొన్నారు.
కౌడిపల్లి, నవంబర్ 4 : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని నాగ్సాన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన, జాయింట్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. తూకం విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులకు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, రెవె న్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.