మెదక్ : పాఠశాలలో పారిశుద్ధ్యం ( Sanitation ) , నాణ్యమైన భోజనం ( Quality meals ) పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ( Collector Pratima Singh ) పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో మొదటి రోజు సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు , పారిశుద్ధ్యం మధ్యాహ్న భోజన పథకం అమలు విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా తనిఖీ చేశారు. వంట విధానం, వంట తయారీ ప్రక్రియను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు నాణ్యతతో సరైన ప్రమాణాలతో ఉండాలని ఆదేశించారు.
పాఠశాలలో చేపట్టిన మూత్రశాలలను పరిశీలించి, మరుగుదొడ్లకు తలుపుల మరమ్మతుల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయులు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.