Collector Rahul Raj | మెదక్ రూరల్, నవంబర్ 17: రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కౌమారదశ పిల్లల ప్రవర్తనలో మార్పుపై ఒక నెల రోజులపాటు (14 నవంబర్ నుంచి..14 డిసెంబర్ వరకు) స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం కౌమార దశలో ఉన్న బాలబాలికల వారి మానసిక ప్రవర్తన, ఆరోగ్యంపై అవగాహన, అనుకూల ప్రతికూల మార్పులు, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, విద్యపై అవగాహన, ఇలాంటి కార్యక్రమాలపై జిల్లా స్థాయిలో అవగాహన కల్పించబడుతుందన్నారు.
కౌమార దశ పిల్లల్లో భయం , వ్యాకులత, అసమర్థత, నిర్లక్ష్యం లాంటివి విడనాడి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ తెలంగాణ రాష్ట్రంలో నే మొట్టమొదటిసారిగా మన మెదక్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని.. ఈ జిల్లాలోని కౌమార దశ పిల్లలకు ఒక గొప్ప అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కౌమారదశ విద్యార్థులకు, కౌమారదశ పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి సమస్యలు ఉన్నా కౌన్సెలింగ్ కోసం 9491098181 అనే టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ , డి ఆర్డీఓ శ్రీనివాసరావు, సీఈవో ఎల్లయ్య, శిశు సంక్షేమ శాఖ అధికారి హేమా భార్గవి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | పంటల అవశేషాలను కాల్చడంతో సేంద్రీయ పోషకాలు నశిస్తాయి.. సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి
Farmers Protest | పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!