నిజాంపేట,మే11 : ఈ రోజుల్లో ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం కావాలని, అందుకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి(SP Uday Kumar Reddy )అన్నారు. మండలంలోని చల్మెడలో శ్రీకర దవాఖాన సహకారంతో నిజాంపేట, రామాయంపేట మండలాల పీఎంపీ&ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి రాచకొండ అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ స్థాయి వారికి ఎంతోగానో దోహదపడుతాయని, రోగులకు వైద్య పరీక్షలు చేయడం వల్ల వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించడం వీలవుతుందని అన్నారు. అనంతరం శ్రీకర దవాఖాన సిబ్బంది ఎస్పీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, రమేశ్ శ్రీకర దవాఖాన సిబ్బంది, తదితరులు ఉన్నారు.