సంగారెడ్డి, నవంబరు 27: గ్రామ పంచాయతీల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బు, మద్యం, క్రికెట్ కిట్లు వంటివి పంపిణీ చేయడం, ఓటర్లను మభ్యపెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ మెసేజ్లు చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరించినా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హె చ్చరించారు.