జొన్న రైతుల ధర్నా
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌లో జొన్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంగ్టి-పిట్లం రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో పిట్లం-ఔరాద్, బీదర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.
- నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
- రైతులకు నచ్చచెప్పి పంపించిన పోలీసులు
- రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కర్షకులు
కంగ్టి, జూన్ 9: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌లో జొన్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంగ్టి-పిట్లం రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో పిట్లం-ఔరాద్, బీదర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వం జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ గన్నీబ్యాగుల కొరత, లారీలు సకాలంలో రాక తూకంలో జాప్యం జరుగుతున్నదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
జొన్నలను కేంద్రాలకు తరలించినప్పటికీ సకాలంలో తూకం వేయక రాత్రీపగలు అనేతేడా లేకుండా అక్కడే పడుకోవాల్సి వస్తుందన్నారు రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జొన్నలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. దళారులకు సంబంధించిన జొన్నలు త్వరగా తూకం వేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో జొన్నలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఎస్సై దుర్గారెడ్డి తెలిపారు. ఆందోళనకు బీఆర్ఎస్ కంగ్టి మండల నాయకులు సంఘీభావం తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

