దౌల్తాబాద్/రాయపోల్, ఫిబ్రవరి 18 : ప్రభుత్వ పాఠశాలల్లో వంట తయారీని పర్యవేక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వండాలని పంట సిబ్బందిని ఆదేశించారు. దొమ్మాట జడ్పీ పాఠశాల హెచ్ఎం ఎండీ బాసిత్, పాఠశాల టీచర్లు పాల్గొన్నారు.
రాయపోల్‌లో కలెక్టర్ హైమావతి పర్యటించి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసేవలు, విద్యార్థినుల భోజనంపై మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సర్పంచ్ రాజు, కస్తూర్బాగాంధీ ప్రిన్సిపాల్ సుగంధ లత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బల్ల మహరాజు పాల్గొన్నారు.