KPR Tournament | తొగుట : యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు. తొగుట మండలంలోని లింగాపూర్ లోబీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేపీఆర్ టోర్నమెంట్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. క్రీడలు కేవలం వినోదం కాదు అవి మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే గొప్ప విద్యాలయయాలు అని పేర్కొన్నారు. ఈ మైదానంలో పడే ప్రతి చెమట చుక్క, భవిష్యత్తులో విజయానికి వేసే బలమైన పునాదిగా భావించాలన్నారు. గెలుపు ఒక్కటే లక్ష్యం కాకూడదు. గెలిచే ధైర్యం, ఓడినప్పుడు మళ్లీ లేచి నిలబడే పట్టుదలే నిజమైన విజయమని గుర్తుంచుకోవాలన్నారు. ఈ టోర్నమెంట్ యువతలో నిద్రిస్తున్న ప్రతిభను వెలికితీసే వేదికగా మారాలని ఆకాంక్షించారు.
ప్రతి ఆటగాడు క్రీడా స్ఫూర్తితో, నిజాయితీతో, క్రమశిక్షణతో ఆడి తమ గ్రామానికి, తన కుటుంబానికి గర్వకారణం కావాలన్నారు. మన గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి క్రీడాకారులు వెలువడే రోజులు దూరంలో లేవని, యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, క్రీడలను జీవిత భాగంగా మార్చుకుంటే సమాజం మరింత బలంగా, ఆరోగ్యంగా మారుతుందన్నారు. అందరూ ఐక్యతతో, ఆనందంతో, క్రీడా స్ఫూర్తితో పాల్గొని ఈ టోర్నమెంట్ను ఘనవిజయంగా నిలపాలని ఆయన కోరుకున్నారు.
రంగంపేట కొనాపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రంగంపేట, వెంకట్రావుపేట ఏటిగడ్డ కిష్టాపూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఏటిగడ్డ కిష్టాపూర్ జట్టు విజయం సాధించింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తగరం అశోక్,, బిక్కునూరి శ్రీశైలం, కొత్తపల్లి సత్తయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, బిక్కునూరి సంతోష్, జీడిపల్లి స్వామి, యాదగిరి, కే భాస్కర్, కొత్తపల్లి భాను, ఈశ్వర్, కుమార్, స్వామి, నరపతి, గణేష్, అనిల్ తదితరులు ఉన్నారు.


Mega Family | మెగా ఫ్యామిలీతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ షో.. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చిరు!
RGV | ‘ధురంధర్’పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు… ఇది కొత్త దర్శకులకి బెంచ్మార్క్
Kangana Ranaut | ఆదిత్య ధర్ ఒక సూపర్ ఫిలిం మేకర్.. ‘ధురంధర్’ దర్శకుడిపై కంగనా రనౌత్ ప్రశంసలు