Mega Family | మెగా ఫ్యామిలీతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ షో.. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చిరు!
Mega Family | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ స్పందనను రాబట్టింది. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాయి.
Mega Family | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ స్పందనను రాబట్టింది. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాయి.సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, మంచి వసూళ్లతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సభ్యులు కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఈ సినిమాను చూసారు. అలాగే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే చోట కలిసి సినిమా చూడడం అభిమానులకు కన్నుల పండుగగా మారింది. ఈ స్పెషల్ షోకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. అభిమానులు భారీగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా చేస్తున్నాయి.
ఇక వసూళ్ల విషయానికి వస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే మంచి కలెక్షన్లు రాబడుతోంది. లాంగ్ వీకెండ్ ఉండటంతో ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పోటీగా ధురంధర్ 2 చిత్రం విడుదల కావడం, ఈ మూవీకి మంచి టాక్ రావడం కొంత కలవర పెడుతుంద.ఇ అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఇవేమి పెద్దగా ప్రభావం చూపవని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పవన్ కళ్యాణ్ మరోసారి తన మాస్ స్టామినాను నిరూపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు.
Megastar @KChiruTweets Garu watched #UstaadBhagatSingh with his family and thoroughly enjoyed it ❤️
He loved every moment of the film and appreciated the efforts of the entire team ❤🔥
Don’t miss his reaction for Vaana Vaana Velluvaaye & EE Manase songs 😍
Watch… pic.twitter.com/GYB0cBOcKn
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

