Harish Rao | నీకు చేత గాక అధికారుల మీద ఏడిస్తే ఎట్లా..? సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు చురకలు
Harish Rao | ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్ శాఖకు, పోలీసులకు సమన్వయం లేదని.. అధికారులు నా మాట వినడం లేదనే వ్యాఖ్యలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు.
Harish Rao | జూన్ 1వ తేదీన వర్షాల గురించి రివ్యూ చేసి ఆదేశాలు ఇస్తే, జూన్ 9వ తేదీన వర్షం పడితే అధికారులు ఎవరూ పని చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్ శాఖకు, పోలీసులకు సమన్వయం లేదని.. అధికారులు నా మాట వినడం లేదనడం కాంగ్రెస్ సర్కార్ పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త కథ మొదలుపెట్టిండు.. మొదట్లోనేమో ఏం మాట్లాడినా బీఆర్ఎస్ మీద ఎగురుడే. ఇప్పుడు పప్పులు ఉడుకుతలేవు. ఇప్పుడు అధికారుల మీదేస్తున్నడు. నేనేం చెప్పినా అధికారులు వింటలేరని.. నా మాట ఎవడు వింటలేరు.. పని అయితలేదని అధికారుల మీద ఏడస్తున్నడు. నీకు చాత గాక అధికారుల మీద ఏడిస్తే ప్రజలు నిన్ను క్షమించరన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు నేను మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యకపోతే నేను ఓట్లే అడగనని చెప్పే దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఇచ్చి చూపిన నాయకుడు.. నీళ్లు ఇచ్చి ఓట్లడిగిన నాయకుడు కేసీఆర్ కాదా.. అని ప్రశ్నించారు. ఈయనేమంటన్నడు. నాది నడుస్తలేదు. గిదా ఓ ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాట. అందరూ ఆలోచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
అధికారులు నా మాట వినడంలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు
ప్రతిదానికి బీఆర్ఎస్ పార్టీని తిడితే జనాలు నమ్మడంలేదని రేవంత్ రెడ్డి కొత్త డ్రామా షురూ చేసిండు
నీకు చేతగాక అధికారుల మీద ఏడిస్తే ఎట్ల?
– హరీష్ రావు https://t.co/JhU6taCXTl pic.twitter.com/VyLKp6A3j6
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026
Read Also :
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

