రాయపోల్,అక్టోబర్ 14 : పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని : ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల అనాజీపూర్ చెరువులో పడి మృతి చెందిన గూని అంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
ఆంజనేయులు మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అదుకుంటామని, తక్షణమే మృతుడి భార్యకు ఫించన్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని అదేశించారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీర్ ప్రభుత్వం అధికారులు కుడా చిత్త శుద్దితో వ్యవహరించాని సూచించారు.
గ్రామంలో అర్హులైన వృద్ధులకు ఫించన్లు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామ టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి భార్య మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరమర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిడి మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ యాదగిరి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ యూసుబ్, తదితరులు ఉన్నారు.