bakki venkataiah | రాయపోల్, జూలై 17 : దౌల్తాబాద్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో మామ కిచెన్ రెస్టారెంట్‌ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాలకు సమానంగా పల్లెల్లో వ్యాపారాలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల యువత అధికంగా ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంగాధర్ గౌడ్, రాజు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, తాజా మాజీ జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పూజిత వెంకటరెడ్డి, మోహన్ రావు, శివరాజ్, ఖళీలుద్దీన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం