Teacher | తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ముక్కరమేష్ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) తమ పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఒక్కొకరికి ఒక జత క్రీడా దుస్తులు (స్పోర్ట్స్ డ్రెస్) లను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సుమారు 20 వేల రూపాయల విలువ గల క్రీడాదుస్తులను ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు ముక్క రమేష్ అందజేయడం జరిగింది.
బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుటకు ప్రోత్సాహకంగా ఉంటుందనే ఆలోచనతో స్పోర్ట్స్ డ్రెస్సులను విద్యార్థులకు అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రమేష్ అన్నారు. చదువు,క్రీడస్పూర్తి,దేశభక్తి, సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని తెలిపారు.
రమేష్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నయీమా కౌసర్ అభినందిస్తూ.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు తమ పాఠశాలలో చేరారని తెలిపారు. రమేష్ హైదరాబాద్ లోని ఒరాకిల్ స్వచంద సంస్థ నుండి నలభై వేల రూపాయలను విరాళంగా సేకరించుటకు చేసిన కృషిని కొనియాడారు.
అదేవిధంగా గత సంవత్సరం ఐదు వేల రూపాయల విలువ గల ఆట వస్థువులను అందజేశారని, NMMS పరీక్షకు సంబంధించిన 3 వేల రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్‌ను అందజేశారని గుర్తుజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు రమేష్ వ్యక్తిత్వం స్పూర్తిదాయకమని అభినందించారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్