Urea | రాయపోల్, ఆగష్టు 05 : యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు నాయక్ హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించి యూరియా పంపిణీ తీరును రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఫర్టిలైజర్ షాపులో ఎరువుల ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో పొందుపరచాలన్నారు.
రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని ఏడీఏ బాబు నాయక్ స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. యూరియాతోపాటు రైతులు నానో యూరియానూ వాడాలని. దీనికోసం ఇప్పటికే రైతులకు మండలస్థాయి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నానో యూరియా వాడితే మంచి ఫలితాలు, దిగుబడులు వస్తాయని ఆయన రైతులకు సూచించారు.
అనంతరం మండల కేంద్రంలోని పలు ఎరువుల షాపుల్లో ఏర్పాటు చేసిన ధరల పట్టికను స్టాక్ వివరాలను పరిశీలించి.. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మినా.. అధిక ధరలకు అమ్మినా చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే స్టాక్ రిజిస్టర్ , బిల్ బుక్స్ తనిఖీ చేసి రైతులకు కచ్చితంగా అన్ని వివరాలతో కూడిన బిల్లు ఇవ్వాలని ఫర్టిలైజర్ యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్ పాల్గొన్నారు.
రైతులకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ : రేగా కాంతారావు
Harish Rao | కాళేశ్వరం రిపోర్టుపై హరీశ్‌రావు పీపీటీ.. కరెంట్ కట్ చేసిన కాంగ్రెస్ సర్కార్