Arrest | వర్గల్, జులై2 : రాత్రిపూట మేకల దొడ్ల నుండి దొంగతనంగా మేకలను ఎత్తుకెళ్లిన దొంగలను బుధవారం గౌరారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వర్గల్ కమాన్‌వద్ద బుధవారం ఉదయం గౌరారం స్టేషన్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఓ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారించగా.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన సుర్యవం రాహుల్ (22) మరొకతను ధరంకార్ గోపాల్‌కృష్ణ (23) హైదరాబాద్ (కుషాయిగూడ)కు చెందినవారుగా చెప్పారు.
ఈ ఇద్దరు వ్యక్తులు గత ఏప్రిల్ నెల 17వ తేదీన మరో ఇద్దరు వ్యక్తులైన నీరజ్‌కుమార్, మాఖన్వాశాల్సింగ్లతో కలిసి గౌరారం, తొగుట పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రిపూట మేకల దొడ్లల్ల నుండి మేకలను ఎత్తుకెళ్లారని.. తిరిగి ఈ రోజు కూడా ఎక్కడెక్కడా దొంగతనాలకు మేకల షెడ్డులు అనువుగా ఉన్నాయో వెతకడానికి వచ్చినట్టు విచారణలో తెలిపారని ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
మొత్తం నలుగురిలో ఇద్దరు పరారిలో ఉండగా.. బుధవారం దొరికిన ఇద్దరిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య