చేర్యాల, మే 22 : పాముకాటుతో రెండు అవులు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సొంరెడ్డి యశ్వంత్‌రెడ్డి అనే రైతు బుధవారం వ్యవసాయ బావి వద్ద ఆవులను కట్టివేసి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వెళ్లి చూసేసరికి రెండు అవులు మృత్యువాతపడ్డట్లు గమనించారు.
పరిసరాల్లో గమనిస్తే పాములు కనిపించాయని తెలిపారు. ఒక్కో ఆవుకు రూ.1లక్షా30వేల విలువ ఉంటుందని, పాముకాటుతో మృతి చెందిన ఘటనతో రూ.2లక్షల60వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. సంబంధితశాఖ అధికారులు స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.