కొమురవెల్లి,ఫిబ్రవరి 21 : చింత కాయల కోసం చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్రాణాలు పోయిన సంఘటన మండలంలోని కిష్టంపేటలో సోమవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెదిన మాదాసు నాగరాజు ఆదివారం చింత కాయల కోసం చింతచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన నాగరాజును హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబానికి సర్పంచ్ బీమనపల్లి కరుణాకర్ రూ.5వేలతో పాటు స్నేహితులు ద్వారా సేకరించిన రూ.35వేలు అందజేశారు.