ములుగు, అక్టోబర్ 18 : గజ్వేల్‌లో కేసీఆర్‌కు లక్షన్నర ఓట్ల మెజార్టీ అందించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ములుగులో బుధవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా వారు హాజరై మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకొని ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కానున్నదన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు, కుల సంఘాలు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఏకగ్రీవ తీర్మానాలు చేశారని తెలిపారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి ముఖ్యమత్రి కేసీఆర్‌కు లక్షన్నర ఓట్ల పైచిలుకు మెజార్టీని కానుకగా అందించాలన్నారు. మేనిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీ నేతలు కంగుతిన్నారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేసింది శూన్యమని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బీఆర్ఎస్ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబేర్‌పాషా, ఎంపీపీ పెద్దబాల్ లావణ్యాఅంజన్గౌడ్, జడ్పీటీనీ నర్సంపల్లి జయమ్మాఅర్జున్గౌడ్, పీఏసీఎస్, ఏఎంసీ, ఎంపీపీ ఉపాధ్యక్షులు నరేశ్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు గణేశ్‌గుప్తా, లింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.