రాయపోల్, జనవరి 25 : ఆత్మీయ సమ్మేళనాలే కాదు ఆపదలో ఉన్నవారికి సాయం చేసే గుణం కూడా మాకు ఉందని పూర్వ విద్యార్థులు చాటుకున్నారు. చిన్నప్పటి నుండి తమతో చదువుకున్న స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందగా.. అతడి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి మానవత్వం చాటుతున్నారు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామానికి చెందిన చెందిన రెడ్డమైన రాజు ఇటివలే గుండె పోటుతో మృతి చెందాడు. తమ మిత్రుడి మరణంతో కలత చెందిన పూర్వ విద్యార్థులు తమకు చేతనైన సాయం చేయాలనుకున్నారు.
రాజుతో కలిసి 2009-2010లో పదో తరగతి చదివిన వారంతా.. ఆదివారం అతడి కుటుంబాన్ని పరామర్శించారు. రాజు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పి.. వారికి రూ. 40 వేల రూపాయలు నగదు అందించారు. పూర్వ విద్యార్థులమైమన తాము రాజు కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.