కొల్చారం, నవంబర్ 9: కాంగ్రెస్ మెడలు వంచడానికే రైతు దీక్ష చేపట్టామని, ఈ రైతుదీక్ష చూస్తుంటే ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా కొల్చారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతుదీక్షకు విజయవంతమైంది. కార్యక్రమానికి మాజీమంత్రి హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి మాణిక్‌రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..ప్రభుత్వ వైఫల్యాలను దుయ్యబట్టారు. రైతుదీక్ష ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సునీతమ్మకు ధన్యవాదాలు తెలిపారు.
అడగకముందే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు పెట్టామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఉచిత కరెంటు వంటి పథకాలతో రైతు శ్రేయస్సుకు తోడ్పడ్డామని చెప్పారు. నీటి తీరువా, భూమిశిస్తూ రద్దు చేశామన్నారు. రేవంత్ బూతుల సీఎం అని, మూసీ కంపు కంటే రేవంత్ మూతికి కంపు ఎక్కువ అన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఊసి పడదని, రేవంత్ తిట్లకు బీఆర్ఎస్కు నష్టం లేదన్నారు. బూటకపు హామీలతో రైతులను వంచించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వలో రైతులు రోడ్లపాలు, గురుకులాలు దవాఖాన పాలు, కానిస్టేబుళ్లు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు బాండ్ పేపర్ ఇచ్చి దాని విలువ లేకుండా చేశారని, దేవుండ్ల మీద ఒట్టు పెట్టి దేవుండ్లను కూడా మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రుణమాఫీని వాయిదాల మీద వాయిదాలు వేస్తుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయలేక ధాన్యం దళారుల పాలవుతుందన్నారు. రూ.2300 అమ్మాల్సిన ధాన్యాన్ని రైతులు 17, 18 వందలకే అమ్ముకుంటూ నష్టపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ పేరు చెప్పుకునేటందుకు సిగ్గు పడుతున్నారన్నారు. గణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సిద్దిరాములుపై వచ్చిన వార్తా కథనాలను చూశానన్నారు.
కల్లాల్లోనే కాలం గడుపుతున్న రైతులు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచింది. ఆరుగాలం కష్టించి పం డించిన పంటను కొనడానికి ప్రభుత్వానికి చేతనయితలేదు రైతులు పం డించిన పంటతో కల్లాల్లోనే కాలం గడుపుతున్నారు. బీఆర్ఎస్ ధర్నాలు చేపడతామ ని హెచ్చరిస్తే ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభించారు. క్వింటాల్‌కు ఇస్తామన్న బోనస్ అం తా బోగస్. బేషరతుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి. అటు పత్తి, చెరుకు రైతులను సైతం ప్రభుత్వం మోసం చేసింది. బీఆర్ఎస్ పదేండ్లలో ఉచిత కరెంటు, సాగునీరు, తాగునీరు వంటి ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టింది.
– సునీతాలక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే
కేసీఆర్ అంటే వికాసం రేవంత్ అంటే విధ్వంసం…
రేవంత్ ప్రభుత్వానికి ప్రజలపై గానీ, పాలనపైగాని శ్రద్ధ లేదు. ఢిల్లీకి బ్యాగులు మోయడానికే సరిపోతుంది. స్వపక్ష నాయకులు ఎప్పుడు తనను కుర్చీ దించుతారోనని భయపడుతున్నారు. ఆనాడు చంద్రబాబుకు తొత్తులాగా పనిచేశారు. ఒకవైపు ఉవ్వెత్తున ఉద్య మం సాగుతుంటే చంద్రబాబు నల్లగొండకి వస్తానంటే రానీయకుండా ఆపడానికి య త్నించిన జేఏసీ నాయకులను తుపాకీతో కాలుస్తానన్న ఉద్యమద్రోహి రేవంత్. ఇప్పటి కీ జయశంకర్ సార్ పేరు పలకలేదు. తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులు కేసీఆర్, హరీశ్‌రావు. రేవంత్ అంటే విధ్వంసం, కేసీఆర్ అంటే వికాసం.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
తెలంగాణను కేసీఆర్ మొదటి స్థానంలో నిలబెట్టారు..
65 ఏండ్ల ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ పూర్తిగా వెనుకబడింది. 14 ఏండ్లు పో రాటం తర్వాత 29 రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆర్థికంగా వెనుకబడిన తెలంగాణను కేసీఆర్ మొదటి స్థానంలో నిలబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ రైతులతో పాటు అన్ని వర్గాలనూ కష్టపెడుతున్నది. ధాన్యం తూకంలో అలసత్వం చేస్తున్నది. మండలానికి ఒక్కటే రైస్‌మిల్ కేటాయిస్తే ధాన్యం కొనుగోళ్లు ఎప్పటికీ పూర్తవ్వవు.
– శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ
రాష్ర్టాన్ని రోడ్డున పడేశారు…
గొడ్డెడ్చిన పొలం, రైతు ఎడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు. ఈ రైతుదీక్ష తెలంగాణలో మలిదశ ఉద్యమానికి పునాది. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ ఆరు నెలల్లో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసి రైతుల కండ్లల్లో సంతోషం నింపారు. ఇప్పుడు రేవంత్ 11 నెలల్లో రాష్ర్టాన్ని రోడ్డున పడేశారు. సన్న వడ్లపై పంట పెట్టేటప్పుడు లేని నిబంధన ఇప్పుడు ఎందుకు, బంగారం జోకి నట్లు వడ్ల ను మిషిన్ల పెట్టి కొల్సుడేంది. మెదక్ జిల్లాకు వచ్చిన మంత్రులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని కొబ్బరికాయ కొట్టక ముందే పారిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలక తప్పదు. అన్నిరకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి, ప్రతి గింజా కొనుగోలు చేయాలి.
– పద్మాదేవేందర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే