రాయపోల్ జనవరి 26. గణతంత్ర వేడుకల సందర్భంగా వడ్డేపల్లి పాఠశాలలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘కాంతార’ సినిమాలోని వేషధారణతో నాట్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్దులను చేసింది. గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు తమలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 9వ తరగతి విద్యార్థి భార్గవి కాంతార చిత్రంలోని వరాహ రూపం అనే పాటకు నృత్యంతో అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.
ఈ సందర్భంగా.. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ఎల్లప్పుడు ప్రోత్సహం అందిస్తామని సర్పంచ్ రాజాగారి రేణుక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయులు. గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.