Autonomous | గజ్వేల్, మార్చి 27: ఉమ్మడి మెదక్ జిల్లాలోని అటానమస్ కళాశాలలపై పునర్విచారణ జరపాలని కోరుతూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూజీసీకి ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలలకు అటానమస్ గుర్తింపు ప్రకటించడం అనేక అనుమానాలకు దారి తీస్తుందన్నారు.
యూజీసీ కమిషన్ న్యూఢిల్లీ వారు తక్షణమే స్పందించి ఆయా కళాశాలలపై పునర్విచారణ జరపాలని.. అప్పటి వరకు కళాశాలల అటానమస్ గుర్తింపును నిలివేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేట్ అటానమస్ కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. విద్యార్థుల వద్ద ఎక్కువగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యను వ్యాపార వస్తువుగా తయారు చేస్తున్నారన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కళాశాలలు అటానమస్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడంపై యూజీసీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలోత్ రాజేష్ నాయక్, సంద గణేష్, పాలకూరి హరీశ్‌లు పాల్గొన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!