మిరుదొడ్డి, డిసెంబర్ 17 : తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని చెప్యాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అల్వాల మహేశ్ (23) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం గడుపుతున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో మహేశ్ కూలీ పనులకు వెళ్లకుండా గ్రామంలో కాలిగా తిరుగుతున్నాడు. ఎలాంటి పనులు చేయకుండా కాలిగా తిరుగుతుంటే ఇల్లు ఎలా గడుస్తుందని తల్లి మందలించింది. ఇదే క్రమంలో ఇంటిలో నిత్యం గొడువలు జరుతుడడంతో తీవ్రమైన మనస్థాపానికి గురైనా మహేశ్ తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతిని భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరాలను ఎస్ఐ తెలిపారు. మృతదేహానని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించారు.