Solipeta Sathish Reddy | తొగుట : తొగుట మండలంలోని లింగాపూర్‌కు చెందిన యువ నాయకుడు వేముల కిషన్ (42) అకాల మరణం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
సోలిపేట సతీష్ రెడ్డి తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డితో కలిసి లింగాపూర్‌లో వేముల కిషన్ పాడె మోసి.. అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. వేముల కిషన్ బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేయడం జరిగిందని.. ఆయన మరణం తీరని లోటన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అండగా ఉంటామని సోలిపేట సతీష్ రెడ్డి భరోసా ఇచ్చారు.
వేముల కిషన్ అంత్యక్రియల్లో నాయకులు బండారు స్వామి గౌడ్, బిక్కునూరి రజిత శ్రీశైలం, తగరం అశోక్, గంగి కృష్ణ, డబ్బికారి పెంటోజీ, రామస్వామి, భూపాల్ రెడ్డి, యాదగిరి, స్వామి, తగరం గణేష్ తదితరులు ఉన్నారు.
Warangal | రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Farmer died | వరినాట్లు వేసేందుకు వెళ్తూ.. పొలంలో పడి రైతు మృతి