సిద్దిపేట, మే 10: బీజేపీ,కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో చిన్నకోడూరు మండలం ఆనంత్సాగర్, చర్లఅంకిరెడ్డిపల్లి చెందిన బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మాట్లాడుతూ సిద్దిపేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కరువు, కష్టాలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రచారం బాగా చేయాలి
నంగునూరు, మే 10: హుస్నాబాద్‌లో జరిగే ప్రచార కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో మండలంలోని బద్దిపడగలో శుక్రవారం మెయిన్ రోడ్డుపై ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగి కొద్దిసేపు మాట్లాడారు. ఈ మేరకు ప్రచారం బాగా చేయాలని.. వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎడ్ల జ్యోత్స్న నర్సింహరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు స్వామి, వెంకన్న, చంద్రమౌళి పాల్గొన్నారు.
హరీశ్‌రావుకు ఆహ్వానపత్రిక అందజేత
గజ్వేల్, మే 10: మండలంలోని అహ్మదీపూర్‌లో నిర్వహించే పెద్దమ్మ, బీరప్ప జాతర కు రావాల్సిందిగా శుక్రవారం సిద్దిపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 17నుంచి 19వరకు పెద్దమ్మ, 21నుంచి 24 వరకు బీరప్ప పండుగ ఉత్సవాలు జరుగుతాయని, కల్యాణోత్సవాలకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, నిజాం, అహ్మద్ పాల్గొన్నారు.
అనుగ్రహం ఉంటే విజయం తథ్యం
సిద్దిపేట, మే 10: హనుమంతుడి నామస్మరణతో సర్వపాపాలు తొలిగిపోతాయని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ స్వాములతో కలిసి దీక్షా కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతుడి అనుగ్రహం ఉంటే విజయం ఉంటుందని, స్వామి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలన్నారు. ప్రసన్నాంజనేయస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా 200 మంది హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.