Rayapol | రాయపోల్, మార్చి 22: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గుర్రాల సోఫా వద్ద బేగంపేట, అప్పాయిపల్లి, వడ్డేపల్లి, దొడ్లపల్లి, మాచినపల్లి గ్రామాల యువకులు రహదారిపై ధర్నాకు దిగారు. హైమద్ నగర్ చౌరస్తా నుంచి నాచారం వరకు ఆర్అండ్బీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని గ్రామాల యువకులతో కలిసి రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
యువకుల ధర్నా గురించి తెలియగానే.. సీఐ వారితో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పారు. మంగళవారం నాడు కలెక్టర్‌ను కలిసి సమస్యల పరిష్కాంర కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యువకులు ధర్నాను విరమించారు. అయితే హామీ అమలు కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.