సిద్దిపేట, ఫిబ్రవరి 28 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.116కోట్ల 15లక్షల 41వేల సిద్దిపేట మున్సిపల్ బడ్జెట్‌ను చైర్పర్సన్ మంజుల ప్రతిపాదించగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమెదించారు. సోమవారం మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. 2022-23 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో మున్సిపల్‌కు పన్నులు, అసైన్డ్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం రూ.2118.56 లక్షలుగా, పన్నులయేతర ఆదాయం రూ.2936.44లక్షలుగా మొత్తం (సాధారణ నిధి, పన్నుల ఆదాయం) రూ. 5055 లక్షలుగా ప్రతిపాదించారు. డిపాజిట్లు, అడ్వాన్స్‌లు, అప్పుల రూపేణ రూ.2209.75 లక్షలు, క్యాపిటల్ ఫండ్ ద్వారా రూ.4350లక్షలు మొత్తంగా రూ.11615.41 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
ఇందులో వ్యయం, వేతనాలకు రూ.1189.68 లక్షలు, శానిటేషన్ నిర్వహణ వ్యయం రూ.450 లక్షలుగా, విద్యుత్‌చార్జీలు రూ.1057.80 లక్షలు, అప్పు చెల్లింపులు రూ.298.40 లక్షలు, హరితబడ్జెట్ రూ.5 05.50 లక్షలు, మొత్తంగా వ్యయం రూ. 3501.38 లక్షలుకాగా, ఇతర నిర్వహణ ఖర్చుల వ్యయం రూ.62 2.52 లక్షలు, సాధారణ నిధి పెట్టుబడి వ్యయం కింద రూ.925.36 లక్షలు, మెత్తం వ్యయం రూ.5049.26లక్షలు, డిపాజిట్లు అడ్వాన్స్ వ్యయం రూ.2209.75, క్యాపిటల్ ఫండ్ మొత్తం వ్యయం రూ.4350.66 లక్షలు పోగా, రూ.5.74లక్షలు మిగులు చూపారు. మొత్తం వ్యయం 11615.41 లక్షల వ్యయంగా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ ఖర్చులు తగ్గించుకునేందుకు బటర్‌ఫ్లై లైట్ల స్థానంలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. పన్నుల వసూళ్లను పక్కగా చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జంగింటి కనకరాజు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
చేర్యాల మున్సిపల్ బడ్జెట్ రూ.14.43 కోట్లు
చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ స్వరూపారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రూ.14.43కోట్లకు పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్లో మున్సిపల్ సొంత నిధులు రూ.5.20 కోట్లు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.9.23కోట్లు మొత్తం రూ.14.43కోట్లకు ఆమోదం తెలిపారు. సమావేశానికి హాజరైన అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ చేర్యాల పట్టణ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. కాగా చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని చేర్యాల పట్టణానికి వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్కు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రకుమార్, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు చెవిటి లింగం, మంగోలు చంటి, ఆడెపు నరేందర్, యాట కనకవ్వ, జుబేదాఖాతూన్, ఉడుముల ఇన్నమ్మ, సందుల సురేశ్, తుమ్మలపల్లి లీల, ముస్త్యాల తార, కో ఆప్షన్ సభ్యులు నాగేశ్వర్రావు, జేబాబేగం, పచ్చిమండ్ల అంజనీదేవి, ఆరోగ్యరెడ్డి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, జేఏవో రాములు, ఏఈ అన్వేశ్‌రెడ్డి పాల్గొన్నారు.