కోహెడ, ఫిబ్రవరి 18 : కోహెడ ప్రాంత అభివృద్ధికి సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్లపల్లి వింజపల్లి గ్రామాల్లో జరిగిన సమ్మక్కసారలమ్మ జాతరను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో కోహెడ మండలం గౌరవెల్లిగండిపెల్లి రిజర్వాయర్లతో సస్యశ్యామలం కానున్నదన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌ను సర్పంచ్ పాము నాగేశ్వరి, ఎంపీటీసీ కోనె శేఖర్, జడ్పీటీసీ, జాతర కమిటీ చైర్మన్ తడిసిన రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాము శ్రీకాంత్, కర్ర రవి తదితరులు శాలువాతో సన్మానించారు.
భక్తులతో కిటకిటలాడిన సమ్మక్క-సారలమ్మ జాతర
మండలంలోని తంగళ్లపల్లి, వింజపల్లి, పరివేదల గ్రామాల్లో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు ఆవుల మహేందర్, ఆంజనేయులు, విజయేందర్‌రెడ్డి, లోనె మల్లేశం, తైదల రవీందర్, దొమ్మాట జగన్‌రెడ్డి, సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, లింగం గీతాంజలి, లింగం సితారి, అబ్దుల్ రహీం, ఇప్పరపల్లి కృష్ణమూర్తి, రాంచంద్రం పాల్గొన్నారు.
మండలంలోని గోవర్ధనగిరి పరిధిలోని సంజీవరాయుడి గుట్ట వద్ద కొలువై ఉన్న సమ్మక్క-సారలమ్మను ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ దర్శించకున్నారు. జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు, జాతర కమిటీ సభ్యులు ఉన్నారు.
పూజలు చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే
మండలంలోని దేవక్కపల్లి, గుండారం గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట సర్పంచ్ లావణ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్, రామలింగారెడ్డి, దేవయ్య, నిర్వాహకులు ఉన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం, చేర్యాల, కొమురవెల్లి, నంగునూరు మండలాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర మూడోరోజూ కొనసాగాయి. శుక్రవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోహెడ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వనదేవతలను దర్శించుకొని పూజలు చేశారు. భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.