చేర్యాల, ఫిబ్రవరి 18 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృ ష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేసేందుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ అన్నారు. ఎంపీపీ అధ్యక్షతన చేర్యాల మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భం గా చిట్యాల, రాంపూర్ సర్పంచ్‌లు ఎ ర్రవెల్లి రామ్మోహన్రావు, రంగు శివశంకర్ తదితరులు మా ట్లాడుతూ.. గ్రామాల్లో బెల్ట్ షాపులను నియంత్రించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరా రు. వేకువజామునే ప్రారంభమైన బెల్ట్‌షాపులు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతున్నాయన్నారు. గ్రామాల్లో తనిఖీ లు చేస్తామని, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ ఎస్సై వినోద్‌కుమార్ కోరారు.
కూరగాయలను సాగు చేసే రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని హార్టికల్చర్ అధికారి మమత కోరారు. ఆకునూ రు గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేయడంతో కరెంట్ స్తంభాలు రోడ్డు మధ్యలోకి వచ్చాయని, వాటిని తొలిగించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశంగౌడ్ కోరారు. మూడు రోజుల్లో స్తంభాలు తొలిగిస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తెస్తామని ఏఈ తస్రీబ్ పేర్కొన్నారు. వేచరేణిలో ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ తొలిగించాలని సర్పంచ్ దుర్గయ్య కోరడంతో.. త్వరలో మారుస్తామని ఏఈ హామీ ఇచ్చారు. ఆకునూరు గ్రామానికి సకాలంలో రేషన్ బియ్యం అందజే యాలన్నారు. వీరన్నపేటలోని చెరువు స్థలాన్ని సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని సర్పంచ్ భిక్షపతి కోరడంతో వారం రోజుల్లో పరిష్కరిస్తానని తహసీల్దార్ ఆరీఫా హామీ ఇచ్చారు. 23 ప్రభుత్వ శాఖల అధికారులకు 16 మంది మాత్రమే సభ కు హాజరయ్యారని, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని ఎంపీపీ, షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో తారిఖ్‌అన్వర్ తెలిపారు. సమావేశానికి జడ్పీటీసీ మల్లేశం, మార్కెట్ చైర్మన్ మల్లేశంగౌడ్, పీఏసీఎస్ ఇన్చార్జి చైర్మన్ నర్సయ్య, ఎంపీవో మహబూబ్ అలీ, ప్రజా ప్రతినిధులు ఎల్లారెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.