సిద్దిపేట, ఫిబ్రవరి 14 : ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరం మార్చి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నర్సింగ్ కళాశాల ప్రారంభ ఏర్పాట్లపై ప్రిన్సిపాల్, వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాత్కాలిక కళాశాల భవనం పాత ఎంసీహెచ్‌లో నిర్వహించాలని సూచించారు. తరగతి గదుల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీఎంఈ రమేశ్, టీఎస్ఎంఎస్ఐడీ ఎండీలతో ఫోన్లో మాట్లాడి కావాల్సిన మరమ్మతులు, అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి విద్యాసంవత్సరం వందమంది విద్యార్థులతో నాలుగేండ్ల కోర్సును 400 మంది విద్యనభ్యసించనున్నారని తెలిపారు. శాశ్వత భవన నిర్మాణం కోసం మరో 15 రోజుల్లో ఎన్సాన్పల్లి శివారులోని 5 ఎకరాల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమీక్షలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, జిల్లా వైద్య నోడల్ అధికారి డాక్టర్ కాశీనాథ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ విజయ్, ఓఎస్డీ బాలరాజు పాల్గొన్నారు.
రైతులకు వ్యవసాయం, పాడి పంటలు రెండు కవలలని, పాడి పరిశ్రమతో అనుకున్నంత ఉపాధి లభిస్తుందని, పాడి పరిశ్రమ అభివృద్ధికి కరీంనగర్ డెయిరీ అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. మండలంలోని రామునిపట్లలో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో 10 వేల లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్ కేంద్రాన్ని, డెయిరీ పార్లర్‌ను జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాశర్మతో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు డెయిరీ మిల్క్ బ్రెడ్ ప్యాకెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ రామునిపట్లలో కరీంనగర్ డెయిరీ ఫామ్ నిర్మించడం సంతోషకరమన్నారు. రైతులు పాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ఆవుపేడ, మూత్రాన్ని ఎరువుగా మారుస్తూ ఎకరాకు రూ.లక్షన్నర వరకు ఆర్జిస్తున్నారని, మన ప్రాంత రైతులు కూడా ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు.
బీజేపీ రైతు వ్యతిరేకం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి సబ్సిడీలో కోత పెట్టి రైతులపై భా రం వేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర బీఎస్డీపీలో 4శాతం అప్పు రూపే ణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, వచ్చే సంవత్సరానికి 3.5 శాతం ఎప్పటిలాగే తీసుకోవచ్చని, అయితే మిగిలిన అరశాతానికి కండిషన్ పెట్టిందని, విద్యుత్ చట్టంలో రీఫామ్స్-సవరణలు చేయాలని, బాయిలకాడ విద్యుత్ మీట ర్లు పెడితేనే ఆ అరశాతం మీ రాష్ర్టానికి అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని మెలిక పెట్టిందన్నారు. దీంతో, తెలంగాణకు రూ.5వేల కోట్ల కోత పడిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యు త్ మీటర్లపై ఏ నిర్ణయం తీసుకోదని, నా గొం తులో ప్రాణం ఉన్నంత వరకు బాయిలకాడ కరెం ట్ మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఏపీలో సీఎం జగన్మోహన్ రూ.5 వేల కోట్ల కోసం శ్రీకాకుళం జిల్లాలో బాయిలకాడ మీటర్లు పెట్టడం షురూ చేశారని తెలిపారు. ప్రభు త్వ సహకారంతో నడిచే పాల డెయిరీలకు ప్రభు త్వం పారితోషికాన్ని అందిస్తున్నదన్నారు. త్వరలోనే కస్తూరిపల్లిలో రూ.2.50 కోట్ల తో చెక్‌డ్యాం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయిల్ పా మ్, మల్బరీ సాగుకు రైతులు ముం దుకు రావాలని, ఖమ్మం జిల్లా సత్తుపల్లి సందర్శనకు వెళ్లాలనుకుంటే అందుకు ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులకు హాస్టల్స్ నిర్మించుకునేలా ముందుకు వస్తే ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. అంతకుముందు జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న పాలు అందించే సంస్థ ఇక్కడ నెలకొల్పడం సంతోషమన్నారు. కరీంనగర్ మిల్క్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ డెయిరీలో పాలు పోసిన రైతులకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీపై పాడి పశువులను అందజేస్తామని తెలిపారు. 12వేల లీటర్లతో ప్రారంభమై లక్షా 30 వేల లీటర్లకు చేరిందని, రూ.7కోట్లతో ప్రారంభమైన కరీంనగర్ డెయిరీ ప్రస్తుతం రూ.360 కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు జరుపుతున్నదన్నారు. ఎంపీపీ మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.
రన్‌ఫర్ కేసీఆర్
ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చింతమడక నుంచి సిద్దిపేట వరకు 18 కి.మీ, సిద్దిపేట నుంచి గజ్వేల్ వరకు 50 కి.మీ కేసీఆర్ కోసం పరిగెత్తే (రన్‌ఫర్ కేసీఆర్) సంబురాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జరుపుకొందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాపయ్య, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, రైతుబంధు జిల్లా డైరెక్టర్ వెంకటేశం, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.